cinema

News, views from all over the world.....!

Monday, September 04, 2006

ప్రత్యేక తెలంగాణపై మీ అభిప్రాయం...?

ప్రియమైన బ్లాగర్ పండితుల దృష్టికి..... తెలంగాణా వివాదం.
నెల్లాళ్లుగా రాజుకుంటున్న ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంపై మీ అనుభవాలను, అభిప్రాయాలను తెలుపగలరు. ఈ విషయంపై తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) కీలక నేతలు కెసీఆర్, నరేంద్రలు మంత్రి పదవులను సైతం త్యాగం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తెరాస కార్యకర్తలు 15 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణాపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని పట్టుబట్టి వరుసగా చివరి నాలుగురోజులు సభ నుంచి బహిష్కృతులైన సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణా సఫలీకృతమౌతుందా..? కాదా...? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుందా ...? ఒకవేళ ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణించాలని కొందరు సూచించడం జరిగింది. వీటన్నింటిపై మీ అభిప్రాయం ఏమిటి...? కాగా భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన ఏనాడో జరిగిపోయిన విషయం విదితమే.

2 Comments:

At 4:38 PM, Blogger chaitü said...

నాకు వ్యక్తిగతం గా ప్రత్యేక తెలంగాణ రావటం ఇష్టం లేదండి. మనం అందరం ఆంధ్రులం. అందులో మళ్ళీ తెలంగాణ, రాయలసీమ అంటూ విడిపోవటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం.
ప్రత్యేక తెలంగాణ వలన వాళ్ళకి ఏమి ఉపయోగాలున్నాయో నాకు తెలియదు కాని, కెసీఆర్, నరేంద్ర ల చిత్తసుద్ధి మీద మాత్రం నాకు మంచి అభిప్రాయం లేదు.
వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ తెలంగాణ ఉధ్యమం కొనసాగిస్తున్నారని నా అభిప్రాయం.
అదేదో టీవీ చ్హానెల్ లో చెప్పినట్టు అర్థ రూపాయి తో ఒక ఆంధ్రా మాప్ కొని పెన్సిల్ తో తెలంగాణ మార్క్ చేసినంత తేలిక కాదు కదా ప్రత్యేక రాష్త్రం ఏర్పరచటాం.

 
At 7:05 PM, Anonymous Anonymous said...

better to arrage for election on telagana ...want or not .....to arrage a vote for all telanaga people....it is not political decision

 

Post a Comment

<< Home