cinema

News, views from all over the world.....!

Friday, July 28, 2006

శ్రీరామదాసు చిత్రం విశేషాలు

అక్కినేని నాగార్జున ప్రధానపాత్ర పోషించిన భక్తిరస కావ్యం శ్రీరామదాసు ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేమకధా చిత్రాలే విడుదలవుతున్న ప్రస్తుత తరుణంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనదైన శైలిలో అలనాటి రామభక్తుడు రామదాసు జీవితచరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రత్యేకించి ఈ చిత్రంలో 'అంతా రామమయం' అనే పాట మదిమదినీ అలరించింది. గతంలో అన్నమయ్య చిత్రానికి అద్భుత బాణీలను సమకూర్చిన ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి శ్రావ్యమైన సంగీతాన్ని అందించి మరోసారి తన సత్తా చాటుకున్నారు. ఈ చిత్రంలో ఫ్యామిలీ హీరోయిన్ స్నేహ నాయికగా నటించింది. ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రం వందరోజుల పండుగను పూర్తి చేసుకుని కలెక్షన్ల పరంగా ఇప్పటికీ ముందంజలో ఉంది. గతంలో రాఘవేంద్రరావు - నాగార్జున - కీరవాణి కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించింతో తెలిసిందే.

1 Comments:

At 7:30 PM, Blogger chaitü said...

i missed this film, even being a fan of Nag :(

 

Post a Comment

<< Home